గొర్రెలు కాస్తున్న టిఆర్ఎస్ ఎంపిటిసి.. రోజు కూలీ రూ.500..!

-

వనపర్తి జిల్లా పాన్ గ‌ల్ మండలం శాఖాపూర్ కు చెందిన అధికార పార్టీ ఎంపీటీసీ సభ్యుడు సుబ్బయ్య యాదవ్ గొర్రెల కాపరి గా మారాడు. తాను ప్రజాప్రతినిధి అయినప్పటికీ చేసేందుకు పనులు లేకపోవడంతో గొర్రెల కాపరి గా మారాన‌ని ఆయ‌న‌ చెప్పారు. గ్రామానికి చెందిన రాములు, కొమ్ము బిచ్చ‌న్న‌ వద్ద గొర్రెల కాపరి గా పని చేస్తున్నాన‌ని ఆయ‌న చెప్పారు. రోజుకు రూ. 500 కూలీ ఇస్తున్నారని… రెండు రోజులుగా తాను పనిచేస్తున్నాన‌ని ఆయన వెల్లడించారు.

trs mptc becomes shepherd wanaparthy district

అంతే కాకుండా ప్రభుత్వం ఎంపిటిసి లకు ప్రత్యేక నిధులను కేటాయించాలని సుబ్బయ్య యాదవ్ కోరారు. ఇది ఇలా ఉంటే సుబ్బయ్య యాదవ్ గొర్రెలు కాస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రామంలో నిధులు రాకపోవడం వల్లనో ఇతర కారణాల వల్లనో ఆయన అసంత్రుప్తి వ్యక్తం చేస్తున్నట్టు అర్థం అవుతోంది. మరి దీనిపై టీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version