తెలంగాణ కొత్త మద్యం షాపులకు టెండర్లు… షెడ్యూల్ ఖరారు చేసిన ఎక్సైజ్ శాఖ

-

తెలంగాణ లో కొత్త మద్యం షాపులకు టెండర్లు ఖరారుకుషెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ నెలలోనే 2019-21 ఎక్సైజ్ పాలసీ ముగిసింది. అయితే కరోనా కారణంగా, లాక్ డౌన్ రావడంతో ఈ ఏడాది మరో నెల మద్యం షాపుల గడువు పొడగించారు. అయితే తాజాగా 2021-23 మద్యం షాపులకు టెండర్ల షెడ్యూల్ ను ప్రకటించారు. నవంబర్ నుంచే కొత్త మద్యం పాలసీ మొదలవుతుందని ఎప్పటి నుంచో ఎక్సైజ్ శాఖ అనుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం షాపులు ఉన్నాయి. కొత్తగా మరో 10 శాతం మద్యం దుకాణాలను పెంచుతారని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం షాపుల్లో రిజర్వేషన్లు ఉంటాయని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీటిపైన స్పష్టమైన విధివిధానాలు ప్రభుత్వం నుంచి రాలేదు.

2021-23 మద్యం షాపు టెండర్ల షెడ్యూల్:

టెండర్ అప్లికేషన్ ప్రారంభం- నవంబర్ 9 , 2021

దరఖాస్తులకు చివరి తేదీ – నవంబర్ 16, 2021

డ్రా తేదీ-  నవంబర్ 18, 2021

నాన్ రీఫండబుల్ ఎమౌంట్- 2 లక్షలు

Read more RELATED
Recommended to you

Exit mobile version