లోయర్ ట్యాంక్ బండ్ లోని తెలంగాణ రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 127వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలలో రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని అన్నారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గొప్ప యోధురాలని కొనియాడారు. భూశిస్తూ పన్ను విషయంలో పటేల్, పట్వారిలను వ్యతిరేకించిన యోధురాలని అన్నారు లక్ష్మణ్.
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత చాకలి ఐలమ్మకు సంసితమైన గౌరవ మర్యాదలు దక్కడం లేదన్నారు. ట్యాంక్ బండ్ పైన కెసిఆర్ ఇప్పటివరకు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. దళిత, గిరిజన బంధు ఏర్పాటు చేసినట్లే రజక బంధు రజకులకు అమలు చేయాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ పార్టీ రజక బంధు ప్రకటించిన తర్వాతనే మునుగోడు ఎన్నికల ప్రచారం చేయాలని డిమాండ్ చేశారు.