విలీనం వర్సెస్ విమోచనం.. కారు-కమలం ఫైట్!

-

తెలంగాణలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య పోలిటికల్ వార్ రోజురోజుకూ ముదురుతుంది…ఇప్పటికే రెండు పార్టీల నేతలు నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నారు…మాటల యుద్ధం కాస్త చేతల యుద్ధం వరకు వెళ్ళిపోయారు. అంటే దాడులు చేసుకుని వరకు రెండు పార్టీలు వెళ్లిపోయాయి. ప్రతి చిన్న విషయంలోనూ రెండు పార్టీలు హోరాహోరీగా రాజకీయం చేస్తున్నాయి. రానున్న రోజుల్లో మరింత దూకుడుగా రాజకీయం చేయడం గ్యారెంటీ గా కనిపిస్తోంది.

ఇదే క్రమంలో సెప్టెంబర్ 17వ తేదీ టార్గెట్ గా రెండు పార్టీలు మరో రాజకీయ యుద్ధానికి తెరలేపాయి. తెలంగాణ విమోచన దినోత్సవం టార్గెట్ గా రెండు పార్టీలు తలపడనున్నాయి. ఇప్పటికే చాలాసార్లు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది…కానీ దీనిపై టీఆర్ఎస్ పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ మరో అడుగు ముందుకేసి…కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ఫిక్స్ అయింది.

ఈ నెల 17న కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో కేంద్ర బలగాలతో పరేడ్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పాల్గొని గౌరవ వందనం స్వీకరించనున్నారు. అటు ఆర్‌ఎస్‌ఎస్ సైతం నిజాం విముక్త స్వాతంత్య్ర అమృతోత్సవాల పేరుతో ఏడాదిపాటు ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించింది.

ఇలా బీజేపీ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతున్న నేపథ్యంలో పోటీగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణ విలీన వజ్రోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇటీవల ముగిసిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణలోనూ రెండు పార్టీలు పోటాపోటిగా కార్యక్రమాలు చేశాయి. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ తో కార్యక్రమాలు చేయందానికి సిద్ధమవుతున్నాయి. దీని ద్వారా సెంటిమెంట్‌ని రగిల్చి రెండు పార్టీలు రాజకీయ లబ్ది పొందడమే లక్ష్యంగా పనిచేయనున్నాయి. మరి ఈ రెండు పార్టీల రాజకీయాన్ని ప్రజలు ఎలా తీసుకుంటారో చూడాలి. మొత్తానికి రెండు పార్టీల మధ్య వార్ గట్టిగానే జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version