సత్తెనపల్లిలో మళ్ళీ తమ్ముళ్ళ రచ్చ..కలిసేలా లేరు!

-

ఎప్పుడైతే కోడెల శివప్రసాద్ చనిపోయారో అప్పటినుంచి సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. గ్రూపు రాజకీయాలు ఎక్కువైపోయాయి…ఒకటి, రెండు గ్రూపులు ఉంటే పర్లేదు..నాలుగైదు గ్రూపులు సత్తెనపల్లిలో తయారయ్యాయి. ఇక చంద్రబాబు కూడా ఇంచార్జ్‌ని ప్రకటించే విషయంల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు

.

ఇంచార్జ్ విషయం పక్కన పెడితే…ఎన్నికలు దగ్గర పడుతున్నాయని దీంతో ఎవరికి వారు సీటు కోసం ట్రై చేస్తున్నారు. ఇదే క్రమంలో నియోజకవర్గంలో సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. కోడెల శివప్రసాద్ ఉంటే ఈ గ్రూపు రాజకీయాలు పెద్దగా ఉండేవి కాదు…ఆయనకే సీటు దక్కేది. ఇప్పుడు ఆయన కుమారుడు కోడెల శివరాం ఉన్నారు…అయితే శివరాంకు సీటు ఇస్తే సొంత పార్టీ వాళ్ళే ఓడించేలా ఉన్నారు. అలా అని శివరాంని కాదని వేరే వాళ్ళకు సీటు ఇస్తే అదొక తలనొప్పి.

ఇప్పటికే సత్తెనపల్లి పంచాయితీపై చంద్రబాబు పలుమార్లు నేతలకు క్లాస్ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని చెప్పారు. ఎన్టీఆర్ భవన్ వేదికగానే కార్యక్రమాలు చేయాలని సూచించారు. కానీ అధిష్టానం ఆదేశాలని తమ్ముళ్ళు పట్టించుకోవడం లేదు. ఎవరికి వారే సెపరేట్ గా నడుస్తున్నారు. తాజాగా అన్నా క్యాంటీన్ల విషయంలో కూడా అదే చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు పెడుతున్నారు.

అయితే సత్తెనపల్లిలో మూడు అన్నా క్యాంటీన్లు వచ్చాయి. తాజాగా ఎన్టీఆర్ భవన్ దగ్గర వైవీ ఆంజనేయులు క్యాంటిన్ కోసం టెంట్ ఏర్పాటు చేస్తే.. పోటీగా ఆ పక్కనే కోడెల శివరామ్ కూడా క్యాంటిన్‌ పెట్టేశారు. రెండూ పక్క, పక్కనే ఉన్నాయి. మరో నేత మన్నెం శివనాగమల్లేశరరావు ఆర్టీసీ బస్టాండ్ ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అన్న క్యాంటిన్ పెట్టారు. ఇలా నేతలు అన్నా క్యాంటీన్ల విషయంలో గ్రూపు గొడవ చూపిస్తున్నారు.  ఇక సత్తెనపల్లి సీటు కోసం నలుగురైదుగురు నేతలు పోటీపడుతున్నారు. కోడెల వారసుడు శివరామ్.. రాయపాటి వారసుడు రంగబాబు.. మాజీ ఎమ్మెల్యే వైవీ ఆంజనేయులు, టీడీపీ నేత మల్లిబాబులు టికెట్ ఆశిస్తున్నారు. మరి ఈ వర్గ పోరులో ఎవరికి సీటు ఇచ్చిన సత్తెనపల్లిలో టీడీపీకి ఇబ్బందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version