టీఆర్ ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి మరో సంచలన నిర్ణయం నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 20 నుంచి నియోజక వర్గాల్లో నిరసనలు చేయాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ధాన్యం కొనుగోలు తో పాటు కేంద్ర ప్రభుత్వం విధానాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20 అన్ని నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు చెయ్యాలని ఎమ్మెల్యే లకు పిలుపు నిచ్చారు సీఎం కేసీఆర్. టిఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్యే లు జనాల్లో వుండాలి.. ప్రభుత్వ పథకాలు వివరించండని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు. మీరు జనాల్లో ఉండకపోతే ఎవరు ఏమి చేయలేరన్నారు కేసీఆర్. రైతు వేదికల్లో రైతులతో సమావేశాలు పెట్టండి.. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయటం లేదన్న విషయాన్ని రైతులకు చెప్పండన్నారు. కేంద్రం చేతులెత్తేసింది కాబట్టి మనం ధాన్యం కొనటం లేదని రైతులోకి తీసుకెళ్లండని పిలుపునిచ్చారు. వరి కి ప్రత్యామ్నాయ
పంటలు రైతులకు వివరించాలని ఆదేశాలు జారీ చేశారు.