30 నియోజకవర్గాల్లో సర్వేలు చేయించా..29 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ దే విజయం : కేసీఆర్‌

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికీ 30 నియోజక సర్వేలు తాను చేయించానని.. .. అందులో 29 స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని తేలిందని సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఇక ఈ నెలాఖరుకు అన్ని నియోజక వర్గాల్లో సర్వే లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రజా ప్రతి నిధులందరూ ప్రజల్లో తిరుగాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ టీఆర్‌ఎస్‌ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు.

ఈనెల 25 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేపట్టాలంటూ తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతంగా… నిరసనలు తెలపాలని ఆయన పిలుపునిచ్చారు.

రైతు వేసే ప్రతి పంటకు కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని… ఆయన డిమాండ్ చేశారు. దేశంలో రైతుల సమస్యను పక్కదారి పట్టించేందుకే.. కాశ్మీర్ ఫైల్స్ సినిమాను విడుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.విభజన చట్టం హామీలను కూడా మోడీ సర్కార్ అమలు చేయడం లేదని.. ఒక వరి మాత్రమే కాదు.. రైతు వేసే ప్రతి పంటకు గిట్టు బాటు ధర కల్పించాలి.. కేంద్రమే కొనాలని సీఎం కేసీఆర్‌ సమావేశం లో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version