తెలంగాణలో ఎదుగుతున్న బీజేపీని నిలువరించేందుకు టీఆర్ఎస్ నానా కష్టాలు పడుతుంది. ఊహించని విధంగా బలపడి..అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న బీజేపీకి చెక్ పెట్టడానికి టీఆర్ఎస్ అనేక దారులు వెతుక్కుంటుంది. ఎలాగో తమపై వచ్చిన వ్యతిరేకతని కేంద్రంపై యుద్ధం చేసి పోగొట్టుకోవాలని చూస్తుంది…ఇప్పటికే కేసీఆర్ ఆ దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇదే క్రమంలో కేసీఆర్…జాతీయ స్థాయిలో ఉన్న విపక్షాలకు దగ్గరయ్యే కార్యక్రమాలు చేస్తున్నారు…బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీల మద్ధతు పొందేందుకు చూస్తున్నారు.
అందుకే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తో కలిపి నిరసన కార్యక్రమాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పాల్గొంటున్నారు. ఇప్పటికే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్ధతుగా నిలిచిన విషయం తెలిసిందే…ఇక సిన్హాకు కాంగ్రెస్ సపోర్ట్ ఉంది. అలాగే తాజాగా కేంద్రం అమలు చేసిన జీఎస్టీ విషయంలో పార్లమెంట్ దగ్గర విపక్షాలు ధర్నాకు దిగాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో టిఆర్ఎస్ ఎంపీలు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ పక్కనే టీఆర్ఎస్ ఎంపీలు నిలబడ్డారు.
ఇలా టీఆర్ఎస్..కాంగ్రెస్ తో క్లోజ్ గానే ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ అంశం రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ పై పోరాటం చేస్తున్న టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఇబ్బందిగా మారింది. కేసీఆర్ జిమ్మిక్కులు వల్ల కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసే ఉన్నాయనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని రేవంత్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ ఎత్తులే వేరు.