ట్రంప్ ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ అకౌంట్​లు పునరుద్ధరణ

-

రెండేళ్ల నిషేధం అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్ ఖాతాలను ఆయా సంస్థల మాతృసంస్థ మెటా పునురుద్ధరించింది. అమెరికా క్యాపిటల్​ భవనం వద్ద హింసాత్మక చర్యలకు పాల్పడిన నిందితులను ప్రశంసించినందుకుగాను ట్రంప్​ ఫేస్​బుక్​ ఖాతాను మెటా 2021 జనవరి 7న సస్పెండ్ చేసింది. ట్రంప్​కు ఫేస్​బుక్​లో 34 మిలియన్లు, ఇన్​స్టాగ్రామ్​లో 23 మిలియన్ల ఫాలోవర్లు అన్నారు.

తన ఫేస్​బుక్​, ఇన్​స్టాగ్రామ్​ ఖాతాలను మెటా పునరుద్ధరించడంపై డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్​లో స్పందించారు. ‘నా వ్యక్తిగత ఫేస్​బుక్ ఖాతాను ఆ సంస్థ మాతృసంస్థ పునరుద్ధరించింది. నా ఖాతాను సస్పెండ్ చేయడం వల్ల ఫేస్​బుక్ బిలియన్ డాలర్లు నష్టపోయింది’ అని ట్రంప్ అన్నారు.

అంతకుముందు గతేడాది నవంబరులో డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్​ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ట్విట్టర్​లో పోల్‌ నిర్వహించిన తర్వాత ఆయన ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విటర్​ అధినేత ఎలాన్‌ మస్క్‌ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version