ఎలాన్‌ మస్క్‌ చేతుల్లోకి ట్విటర్‌.. ట్రంప్‌ రియాక్షన్ ఏంటంటే..!

-

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ను టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ట్విటర్‌ విక్రయంపై హర్షం వ్యక్తం చేస్తూ ఇప్పుడిది తెలివైన వ్యక్తి వ్యక్తి చేతుల్లోకి వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్’ వేదికగా ఆయన ఈ పోస్ట్‌ చేశారు.

‘ట్విటర్ ఇప్పుడు స్థిరచిత్తం కలిగిన వ్యక్తి చేతుల్లో ఉంది. దీంతోపాటు అమెరికాను ద్వేషించే ర్యాడికల్‌ లెఫ్ట్‌ ఉన్మాదుల నిర్వహణ నుంచి బయటకు వచ్చింది. ఈ విషయాలపై చాలా సంతోషంగా ఉంది. సంస్థను తీవ్రంగా దెబ్బతీసిన నకిలీ ఖాతాలు, ఇతరత్రా కార్యకలాపాలను వదిలించుకోవడానికి ట్విటర్‌ కృషి చేయాలి’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఆయన ట్విటర్‌కు తిరిగి వస్తారో లేదో మాత్రం వెల్లడించలేదు. 2021 జనవరిలో అగ్రరాజ్యంలోని క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌పై ట్విటర్‌ శాశ్వతంగా నిషేధం విధించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version