నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. కవిత ట్వీట్‌కు రాజగోపాల్‌ కౌంటర్‌

-

దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించడంపై రాష్ట్రంలో దుమారం రేగుతోంది. ఇప్పటికే బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఈ విషయంపై స్పందించిన సంగతి తెలిసిందే. వీరిద్దరికి కవిత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. కవిత రీ ట్వీట్ పై రాజగోపాల్ రెడ్డి మరోసారి రియాక్ట్ అయ్యారు.

తొలుత ఈ విషయంపై రాజగోపాల్‌ రెడ్డి ట్విటర్‌లో.. ‘‘కవిత పేరును ఛార్జ్‌షీట్‌లో 28 సార్లు ప్రస్తావించారు’’ అని ఆమెను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. దీనిపై ఆమె స్పందిస్తూ..  ‘‘రాజగోపాల్ అన్న.. తొందర పడకు.. మాట జారకు. 28 సార్లు నా పేరు చెప్పించినా.. 28వేల సార్లు చెప్పించినా.. అబద్ధం నిజం కాదు. ట్రూత్‌ విల్‌ ప్రివెయిల్‌ ’’ అని కవిత కౌంటర్‌ ఇచ్చారు.

కవిత ట్వీట్‌కు మళ్లీ రాజగోపాల్ రెడ్డి గట్టిగానే బదులిచ్చారు. ‘‘నిజం నిప్పులాంటిది చెల్లెమ్మా.. నువ్వు లిక్కర్‌ స్కామ్‌లో ఉంది నిజం. మునుగోడు ఉప ఎన్నికలో నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక పారదర్శకంగా టెండర్‌ ద్వారా వచ్చిన రూ.18వేల కోట్ల విషయంలో నాపై విష ప్రచారం చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. రాబోయే రోజుల్లో అవినీతిమయమైన కల్వకుంట్ల కుటుంబం అంతా జైలుకి వెళ్లడం ఖాయం’’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version