Breaking : టీఎస్‌ ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ షురూ.. ఎప్పటినుండంటే..?

-

టీఎస్‌ ఎంసెట్‌ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ఉద‌యం విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇంజినీరింగ్‌లో 80.41 శాతం మంది ఉత్తీర్ణులవగా, అగ్రికల్చర్‌లో 88.34 శాతం మంది ఉత్తీర్ణత సాధించార‌ని మంత్రి వెల్ల‌డించారు. ఎంసెట్ ఫ‌లితాలు విడుద‌లైన నేప‌థ్యంలో కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుద‌ల చేశారు. మూడు విడ‌త‌ల్లో కౌన్సెలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. మొద‌టి విడుత షెడ్యూల్.. ఆగ‌స్టు 21 నుంచి 29 వరకు ఆన్ లైన్ స్లాట్ బుకింగ్, ఆగ‌స్టు 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన, ఈనెల 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు, సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు, రెండో విడుత షెడ్యూల్.. సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్ లు.. సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన.. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు.. అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు. మూడో విడుత షెడ్యూల్.. అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్.

TS EAMCET Counselling Dates 2021 Rank Wise లింక్ Registration, Fees,  Documents

అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన. అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు. అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు. అక్టోబరు 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ. ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలను జులై 18 నుంచి 21 వరకు నిర్వహించారు. మొత్తం 1,72,243 మంది విద్యార్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగా‌.. ప‌రీక్షకు 1,56,860 మంది హాజరయ్యారు. వీరిలో 1,26,140 మంది ఉత్తీర్ణత (80.41 శాతం) సాధించారు. అదేవిధంగా అగ్రికల్చర్‌, మెడికల్‌ స్ట్రీమ్‌కు 94,476 మంది దరఖాస్తు చేసుకోగా, 80,575 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. వీరిలో 71,180 మంది (88.34 శాతం) అర్హత సాధించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version