నేటి నుంచి ఎంసెట్‌ హాల్‌‌టి‌క్కెట్లు డౌన్‌‌లోడ్‌

-

తెలంగాణలో ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చ‌ర్‌, మెడిక‌ల్ (ఫార్మ‌సీ, వెట‌ర్న‌రీ) కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ఎంసెట్ ప‌రీక్ష ఈ నెల 9 నుంచి 14 వరకు జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌ను రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే పూర్తిచేసింది. అదేవిధంగా ప‌రీక్ష‌కు సంబంధించిన హాల్‌టికెట్ల‌ను టీఎస్‌‌ఎం‌సెట్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఈరోజు నుంచి హాల్‌‌టి‌క్కె‌ట్లను అధికారిక‌ వెబ్‌సైట్ https://eamcet.tsche. ac.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని ఎంసెట్‌ కన్వీ‌నర్‌ ప్రొఫె‌సర్‌ గోవ‌ర్ధన్‌ తెలి‌పారు.

అయితే.. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వం త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే.. ఇదే స‌మ‌యంలో విద్యార్థులు కూడా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వం, సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version