బాలిక ఇష్టంతోనూ సెక్స్ చేసినా..అది అత్యాచారమే : తెలంగాణ హై కోర్టు

-

బాలికకు ఇష్టం ఉండి.. సెక్స్‌ చేసినా అది అత్యాచారమే అవుతుందని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ కు చెందిన 8వ తరగతి చదువుతుంది ఓ బాలిక. ఖమ్మం జిల్లాలో ఉన్న వివాహితుడైన బంధువు {26}, వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాద్‌ వచ్చాడు. ఈ నేపథ్యంలోనే..ఆ బాలికతో అతడు సన్నిహితంగా మెలిగాడు.

బాలిక తల్లిదండ్రులు పనులకు వెళ్లడంతో.. ఆ బాలికపై లైంగిక దాడి చేశాడు. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని బెదిరించాడు. అయితే.. ఇటీవల ఆ బాలిక అనారోగ్యం బారీన పడింది. ఆస్పత్రికి వెళ్లగా గర్భం దాల్చిన విషయం బయటపడింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అతనిపై కేసు నమోదు చేసి.. పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు బాలిక గర్భాన్ని తొలగించేందుకు ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. దీంతో బాధిత కుటుంబం హై కోర్టు ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో గర్భం తీసేయాలని.. హై కోర్టు ఆదేశించింది. అలాగే… బాలికకు ఇష్టం ఉండి.. సెక్స్‌ చేసినా అది అత్యాచారమే అవుతుందని సంచలన తీర్పు ఇచ్చింది కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version