దేశంలో తొలిసారి కొత్త స్కీమ్ లాంచ్… వారికి కూడా ఇక నుండి లోన్స్..!

-

సాధారణంగా ఎవరికైనా ఆర్ధికంగా ఇబ్బంది ఉంటే లోన్ కోసం చూస్తారు. లోన్ వచ్చిందంటే ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. తరవాత మెల్లగా లోన్ ని క్లియర్ చెయ్యచ్చు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు సైతం లోన్స్ ని ఇస్తూ ఉంటాయి. అయితే లోన్ పొందడం అంత ఈజీ కాదు. దీని కోసం పెద్ద ప్రాసెస్ ఏ వుంది. రెగ్యులర్ ఇన్కమ్, క్రెడిట్ స్కోర్ వీటిని చూస్తారు. కనుక ఈ పర్సనల్ లోన్స్ పొందడం కష్టం.

ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు ఖైదీలకు రుణాలు అందించవు. జైలు శిక్ష అనుభవించే వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండచ్చు కూడా. అందుకే వీరికి ఊరట కలిగించాలని రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి వివరాల లోకి వెళితే.. రానున్న కాలం నుండి కూడా ఖైదీలు లోన్ ని పొందొచ్చు. గ్యారంటీ లేకుండానే లోన్ పొందే వెసులుబాటు కల్పించారు. పైగా వడ్డీ కూడా తక్కువే. ఖైదీలకు రుణాలు లభిస్తుండటం దేశంలో ఇదే తొలిసారి.

ఈ అవకాశం కేవలం మహరాష్ట్ర ప్రభుత్వం కలిపిస్తోంది. అన్ని రాష్ట్రాల్లోనూ లేదు. జైలు ఖైదీలకు కూడా రుణాలు అందించేందుకు మహరాష్ట్రలోని ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పుణేలోని యరవాడా జైలులో ఈ పైలెట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయనున్నారు.

పర్సనల్ లోన్స్ లభిస్తాయి. రూ.50 వేల వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రేటు కూడా కేవలం 7 శాతంగా ఉండనుంది. ప్రస్తుతం బ్యాంకులు పర్సనల్ లోన్స్‌పై కనీసం 12 శాతం వడ్డీ రేటును వసూలు చేస్తున్నాయి. ఖైదీల రోజూవారీ వేతనం, జైలు శిక్ష వంటి వాటిని బట్టి లోన్ ఉంటుంది. ఎలాంటి గ్యారంటర్ అవసరం లేదు. యరవాడా జైలులో దాదాపు 1000 మందికి పైగా ఖైదీలకు తొలిగా రుణాలు లభించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version