Breaking : పీఈ సెట్ ఫలితాలు విడుదల

-

TS PECET-2023 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 96.50% ఉత్తీర్ణత నమోదు కాగా బీపీఎడ్లో 96.65 శాతం, డీపీఎడ్ 96.18 శాతం నమోదైంది. బీపీఎడ్లో జనగామకు చెందిన జి.దేవ ప్రథమ ర్యాంకు సాధించగా, డీపీఎడ్ నల్లగొండ జిల్లాకు చెందిన ప్రవళిక ప్రథమ ర్యాంక సాధించారు. 16 బీపీఎడ్ కాలేజీల్లో 1660 సీట్లు, 4 డీపీఎడ్ కాలేజీల్లో 350 సీట్లు ఉన్నాయి. మరిన్ని వివరాలు.. వెబ్సైట్: pecet.tsche.ac.in ద్వారా తెలుసుకోవచ్చు.

ఇదిలా ఉంటే.. తెలంగాణలో 503 Group 1 సర్వీసుల ఉద్యోగాల భర్తీకి జూన్‌ 11న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’ విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చేవారంలో ఆన్సర్ కీ విడుదలయ్యే అవకాశముంది. TSPSC Group 1 పరీక్ష ప్రిలిమినరీ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు TSPSC ఏర్పాట్లు చేస్తోంది. ప్రస్తుతం ఓఎంఆర్‌ పత్రాల ఇమేజింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రక్రియ రెండు మూడు రోజుల్లో ముగియనుంది. అనంతరం ప్రిలిమినరీ కీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version