తెలంగాణ ఎస్సై, ఏఎస్సై అభ్యర్థులకు అలర్ట్‌.. తుది రాతపరీక్ష ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల

-

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల తుది రాతపరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ ని గురువారం తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి విడుదల చెయ్యడం జరిగింది. మార్చి 11 న నిర్వహించిన ఐటీ అండ్ కమ్యూనికేషన్స్, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్సై, 26న జరిగిన పీటీవో ఎస్సై, ఏప్రిల్ 8న జరిగిన అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ అలాగే 9న జరిగిన జనరల్ స్టడీస్ ప్రశ్నపత్రాల ప్రాథమిక ‘కీ’ ని విడుదల చేసింది ప్రభుత్వం.

ఈ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నపత్రాల ఆన్సర్ ‘కీ’ అధికారిక వెబ్‌సైట్‌ లో మే 11న‌ ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు బోర్డు ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు తెలియపరిచారు . విడుదల చేసిన కీ పై ఎవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని మే 14న సాయంత్రం 5 గంటల్లోపు ఆన్‌లైన్‌ విధానంలో నమోదు చేయాలని సూచించారు బోర్డు ఛైర్మన్‌ వివి శ్రీనివాసరావు పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version