ఏపీ డీఈఈసెట్ – 2023 నోటిఫికేషన్ విడుదల

-

ఏపీ ప్రభుత్వం, పాఠశాల విద్యా విభాగం, 2023-25 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డీఈఎల్ఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే డీఈఈసెట్ – 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఈఈసెట్ ర్యాంకు ద్వారా ఏపీలోని ప్రభుత్వ/డైట్‌లు/ప్రైవేట్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. జూన్‌ 12, 13 తేదీల్లో డీసెట్‌ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ మే 11 నుంచి ప్రారంభమై 28 వరకు కొనసాగుతుంది. జూన్‌ 5న హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు

ఈ పరీక్ష ఫలితాలు, ర్యాంకులు జూన్‌ 19న విడుదల చేస్తారు. మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఐచ్ఛికాలను 22 నుంచి 27 వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్‌ లేఖలను 28 నుంచి 30 వరకు జారీ చేస్తారు. డైట్‌ల్లో ధ్రువపత్రాల పరిశీలన జూన్‌ 31 నుంచి జులై 6 వరకు కొనసాగుతుంది. ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పరీక్ష: ఏపీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (డీఈఈసెట్) – 2023

కోర్సు: డీఈఎల్ఈడీ (డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్)

అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హతలు ఉండాలి.

ఎంపిక: డీఈఈసెట్ సాధించిన ర్యాంకు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

అప్లికేషన్ ఫీజు: రూ. 750 చెల్లించాలి.

చివరి తేదీ: మే 28, 2023.

ఫలితాలు: జూన్ 19, 2023.

వెబ్‌సైట్: https://apdeecet.apcfss.in

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version