పదోతరగతి విద్యార్థులకు అలర్ట్‌.. వార్షిక ప‌రీక్షల ఫీజు షెడ్యూల్ విడుదల

-

తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజైంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠ‌శాల‌ల్లో ప‌ది చ‌దువుతున్న విద్యార్థులు 2023 నవంబర్ 17లోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబ‌ర్ 1 వ‌ర‌కు రూ. 50 ఫైన్ తో, డిసెంబ‌ర్ 11 వరకు రూ. 200 ఫైన్ తో , డిసెంబ‌ర్ 20వ తేదీ వ‌ర‌కు రూ. 500 ఫైన్ తో ఫీజు చెల్లించొచ్చు. రెగ్యుల‌ర్ విద్యార్థులు రూ. 125, మూడు సబ్జెక్టులు.. అంత కంటే త‌క్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 110, మూడు కంటే ఎక్కువ స‌బ్జెక్టులు ఫెయిలైన వారు రూ. 125, వొకేష‌న‌ల్ విద్యార్థులు రూ. 60 చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫీజు షెడ్యూల్‌ వివరాలివే..

  • ఫస్ట్, సెకండియర్‌ థియరీ పరీక్షలకు రూ.550 ఫీజు చెల్లించాలి.
  • ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ జనరల్, ఫస్ట్, సెకండియర్‌ చదివే విద్యార్ధులు ఒకేషనల్‌ ప్రాక్టికల్స్‌కు రూ.250 చెల్లించాలి. అలాగే బ్రిడ్జి కోర్సులకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఇంటర్మీడియెట్‌ ఫస్ట్, సెకండియర్‌ రెండేళ్లకు కలిపి థియరీ పరీక్షలకు రూ.1100 ఫీజు చెల్లించాలి. ఒకేషనల్‌ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్‌ బ్రిడ్జి కోర్సుకు రూ.300 చెల్లించాలి.
  • గతంలో ఇంటర్మీడియెట్‌ పాసై ఇంప్రూవ్‌మెంట్‌ రాసే విద్యార్ధులు రెండేళ్లకు కలిసి ఆర్ట్స్‌ విద్యార్థులైతే రూ.1240, సైన్స్‌ విద్యార్థులైతే రూ.1440 చెల్లించాల్సి ఉంటుంది.

తెలంగాణ ఇంటర్‌ 2024 పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఇవే

మరోవైపు తెలంగాణలో ఇంటర్మీడియట్‌ బోర్డు కూడా ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. నవంబర్‌ 14వ తేదీ వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు విధించినట్లు బోర్డు వెల్లడించింది. నిర్దేశిత ఆలస్య రుసుంతో డిసెంబరు 20వ తేదీ వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు బోర్డు వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version