తెలంగాణ‌లో ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే..

-

తెలంగాణ‌లో వివిధ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్న‌త విద్యామండ‌లి ఖ‌రారు చేసింది. నిజానికి.. గ‌తంలోనే ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ల షెడ్యూల్‌ను ఖరారు చేసిన‌ప్ప‌టికీ క‌రోనా వైర‌స్ కార‌ణంగా షెడ్యూల్ వాయిదాప‌డింది. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌ ఉన్న‌త‌విద్యామండ‌లి తాజాగా నూత‌న షెడ్యూల్‌ను విడుద‌ల చేసింది. అయితే.. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఉన్న‌త విద్యామండ‌లి పేర్కొంది.

తాజా షెడ్యూల్ ప్ర‌కారం వివ‌రాలు ఇలా ఉన్నాయి… ఆగ‌స్టు 31న టీఎస్ ఈసెట్‌, సెప్టెంబ‌ర్ 9 నుంచి 14వ తేదీ వ‌ర‌కు ఎంసెట్ ఇంజినీరింగ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ 21 నుంచి 24 వ‌ర‌కు పీజీ ఈసెట్‌, సెప్టెంబ‌ర్ 28, 29 తేదీల్లో ఎంసెట్ అగ్రిక‌ల్చ‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. సెప్టెంబ‌ర్ 30, అక్టోబ‌ర్ 1న టీఎస్ ఐసెట్‌, అక్టోబ‌ర్ 1 నుంచి 3 వ‌ర‌కు ఎడ్‌సెట్‌, అక్టోబ‌ర్ 4న లాసెట్ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version