టీఎస్పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో కీలక మలుపు

-

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ పేపర్‌ లీక్‌ కేసులో నిందితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తుల భార్యలు కూడా టీఎస్‌పీఎస్‌సీ పరీక్షకు హాజరయినట్టు సిట్ పోలీసులు తాజాగా గుర్తించారు. కమిషన్ నెట్వర్క్ విభాగం ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజశేఖర్ రెడ్డి భార్య సుచరిత, రాజేశ్వర్ నాయక్ భార్య శాంతి డివిజనల్ ఎకౌంట్స్ ఆఫీసర్ (డీపీఓ) ప్రశ్న పత్రం సాయంతో పరీక్ష రాసినట్టు దర్యాప్తులో తేలింది.

ఇక నిందితురాలు రేణుక రాథోడ్‌కు పరిచయస్తుడైన రాహుల్ ఆమె వద్ద అసిస్టెంట్ ఇంజినీర్ ప్రశ్నపత్రం తీసుకున్నాడు. రేణుక భర్త ఢాక్యానాయక్ నుంచి నాగార్జునసాగర్‌కు చెందిన రమావత్ దత్తు ఏఈ క్వశ్చన్ పేపర్ కొనుగోలు చేశాడు. ఈ కేసులో నిందితులు, పరీక్ష రాసిన అభ్యర్థుల కాల్‌డేటాను సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version