మహిళలకు శుభవార్త.. రాఖీ పండుగకు బంపర్‌ ఆఫర్‌..

-

టీఎస్‌ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్‌ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చేందుకు, ఆర్టీసీ సర్వీసులను ప్రజలకు మరింత దగ్గర తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఇప్పటికే రకరకాల ఆఫర్లు ప్రకటిస్తూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు ఆర్టీసీ అధికారులు. తాజాగా మరో మంచి ఆఫర్ ప్రకటించింది ఆర్టీసీ. రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. రాఖీ పౌర్ణమి రోజున మహిళలు వారి సోదరులకి స్వయంగా వెళ్లి రాఖీ కట్టలేని పరిస్థితులు ఉంటే.. టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసుల ద్వారా.. అతి తక్కువ ధరలకే రాఖీలను పంపించుకోవచ్చని ప్రకటించింది.

టీఎస్ ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సర్వీసుల ద్వారా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో డోర్ డెలివరీ సదుపాయం కల్పించింది ఆర్టీసీ. దీని గురించి పూర్తి సమాచారం కోసం 9154298858, 9154298829 నంబర్లలో సంప్రదించాలని టీఎస్‌ ఆర్టీసీ సూచించింది. ఊర్ల నుంచి హైదరాబాద్ రాలేని వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించింది ఆర్టీసీ. మహిళలకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పుడూ తోడు ఉంటుందని.. అందుకే వారికి ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినట్టు పేర్కొంది ఆర్టీసీ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version