రాష్ట్రంలో పలు బస్ స్టేషన్ల నిర్మాణం, విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతి..!

-

రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు ఆర్టీసీ బోర్డు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ బస్ భవన్ లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశమైంది. కొత్త డిపోలు, బస్ స్టేషన్ లకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లిలో కొత్త బస్ డిపో కోసం నిర్మాణం కోసం 11.70 కోట్లు, ములుగు జిల్లా ఏటూరునాగారంలో కొత్త బస్ డిపో నిర్మాణం కోసం 6.28 కోట్లు, ములుగు లో కొత్త బస్ స్టేషన్ నిర్మాణం కోసం 5.11 కోట్లు, సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కొత్త బస్ స్టేషన్ కోసం 3.75 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చింది.

అలాగే ఖమ్మం జిల్లా మధిరలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం 10 కోట్లు, ములుగు జిల్లా మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి 51 లక్షలు, పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టేషన్ విస్తరణ కోసం 95.00 లక్షలు, సూర్యాపేట జిల్లా కోదాడ్ వద్ద ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం 17.95 కోట్లు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రాబోయే “సరస్వతి పుష్కరాల” దృష్ట్యా ఆధునిక బస్ స్టేషన్‌ నిర్మాణానికి 3.95 కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీ బోర్డు అనుమతులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news