భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు.టీటీడీ గోశాలలో 100 గోవులు మృతి చెందాయని ఆయన చేసిన ఆరోపణలు అబద్ధమని అన్నారు. కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు అబద్దం అని తాను నిరూపిస్తానని వెల్లడించారు.
శుక్రవారం టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు అబద్దం అని తాను నిరూపిస్తే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. గతంలో తిరుమలలో జరిగిన అక్రమాలను బయటపెట్టారని మీడియా వాళ్లపై కూడా కేసులు పెట్టిన చరిత్ర వైసీపీది అని విమర్శించారు.ప్రతీకారం కోసం గత వైసీపీ ప్రభుత్వం పనిచేస్తే ప్రజల కోసం కూటమి ప్రభుత్వం పని చేస్తుందని బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి స్పష్టంచేశారు.