తిరుమల తిరుపతిలో చత్రపతి శివాజీ బొమ్మల వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై క్లారిటీ ఇచ్చింది టీటీడీ పాలక మండలి. చత్రపతి శివాజి ప్రతిమను ఇఓ దర్మారెడ్డికి పాలకమండలి సభ్యుడు మిలింద్ నర్వేకర్ అందజేశారు.
ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి సభ్యుడు మిలింద్ నర్వేకర్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజి బొమ్మలను తిరుమలకు అనుమతించడం లేదని దుష్ప్రచారం చేస్తూన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పవిత్ర దృష్యా రాజకీయ,హిందువేతర సంస్థలకు చెందిన వాటివి మాత్రమే తిరుమలకు అనుమతించబోమని స్పష్టం చేశారు.
కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా మహరాష్ట్ర భక్తుడు చెందిన చత్రపతి శివాజి బోమ్మ తోలగింపు వివాదం తల్లేత్తిందని పేర్కొన్నారు. హిందువుల ఆరాధ్యదైవమైన చత్రపతి శివాజి, రామకృష్ణ పరమహంస, వివేకానంద వంటి వారి ప్రతిమలు అనుమతిస్తామని క్లారిటీ ఇచ్చారు పాలకమండలి సభ్యుడు మిలింద్ నర్వేకర్.