”పక్కా కమర్షియల్” ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఎప్పుడంటే

-

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్ ‘. ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశికన్నా హీరోయిన్ గా నటిచింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ-2 పిక్చర్స్- యు.వి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కోర్టు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. అయితే.. ఈ నెల మొదటి వారంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం అలరించలేకపోయింది. ఇది ఇలా ఉండగా..ఈ సినిమా నుంచి ఓ అప్డేట్‌ వచ్చింది. ‘పక్కా కమర్షియల్ ‘ మూవీ ఓటీటీ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఆగస్టు 5 వ తేదీన ‘పక్కా కమర్షియల్ ‘ సినిమా ఓటీటీలో రిలీజ్‌ కానుంది. ఆహా ఓటీటీ ఫ్లాట్‌ పార్మ్‌ లో ‘పక్కా కమర్షియల్ ‘ మూవీ రిలీజ్‌ కానుంది. ఈ మేరకు ఆహా అధికారిక ప్రకటన చేసింది. ఈ సినిమాలో థియేటర్లో చూడని వారు.. ఇంట్లోనే చూసుకోవచ్చు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version