శ్రీవారి ఉచిత దర్శనం టికెట్లు విడుదల..ఇలా బుక్ చేసుకోండి !

-

తిరుమల శ్రీవారి సర్వ దర్శనం టోకెన్లు కాసేపటి క్రితమే ఆన్ లైన్ లో విడుదల అయ్యాయి. విడుదలైన క్షణాల్లోనే…. హాట్ కేకులా సర్వదర్శనం టోకెన్లు అందుకుంటున్నారు శ్రీ వారి భక్తులు. కేవలం… 25 నిముషాల్లోనే 2.4 లక్షల సర్వదర్శనం టోకెన్లు పోందారు భక్తులు. ఇప్పటి వరకు 30 నిముషాలలో సర్వదర్శనం టోకేన్లు కేటాయింపు పూర్తి అయింది.

సెప్టంబర్ 26 నుంచి అక్టోబర్ 31వ తేది వరకు సంభందించిన టిక్కెట్లు ఆన్ లైన్ లో విడుదల చేసింది టిటిడి పాలక మండలి. రోజు కి 8 వేల చోప్పున …. 2.79 లక్షల టిక్కెట్లు విడుదల చేసింది టిటిడి. క్లౌడ్ మెనెజ్మెంట్ విధానంతో సులభతరంగా ఆన్ లైన్ లో టిక్కెట్లు పోందారు శ్రీవారి భక్తులు.

టిటిడి చరిత్రలోనే రికార్డ్ స్థాయి సమయంలో టిక్కేట్లు కేటాయింపు పూర్తయింది. టీటీడీ ఆన్‌ లైన్‌ టికెట్ల వెబ్‌ సైట్‌ జియోమార్ట్‌ వెబ్‌ సైటు కు రీడైరెక్ట్‌ అవుతోందని పలువరు భక్తులు చెబుతున్నారు. జియో సర్వీస్‌ ప్రొవైడర్‌ గా వ్యవహరిస్తోందని.. ప్రస్తుతానికి tirupatibalaji.ap.gov.in లేదా tirupatibalaji.jiomart.com ల లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది టీటీడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version