టీటీడీ: డిసెంబర్ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటా విడుదల..!

-

టిటిడి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక తిరుమల కొండపై డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.300ల ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవాళ ఉదయం విడుదల చేసింది. సోమవారం రోజూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ వివిధ స్లాట్లలో టికెట్ల జారీ జారీ ఉంటుందని తెలియజేశారు. ఇక రోజూ 19 వేల టికెట్లను భక్తులకు ఇస్తామని టీటీడీ అధికారులు తెలిపారు. భక్తులంతా కరోనా నియమ నిబంధలను పాటించాలన్నారు. దైవ దర్శనాలు కూడా సోషల్ డిస్టాన్స్ పాటిస్తూ చేసుకోవాలని తెలిపారు.

ttd

అంతేకాదు శ్రీవారి ఆలయంలో రోజూ శానిటేషన్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులు, ముందుగానే తిరుమలకు వచ్చి, తమకు కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం స్వామి వారి దర్శనం చేసుకోవాలని కోరారు. టీటీడీ వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాలన్నారు. అయితే మధ్యవర్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడొద్దని తెలిపారు.

ఇక వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువ‌మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం చేయించ‌డం కోసం తిరుమ‌ల వెంక‌టేశ్వర‌స్వామివారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారాన్ని ప‌ది రోజుల పాటు తెర‌చి ఉంచాల‌ని నిర్ణయించిన‌ట్టు టిటిడి ధ‌ర్మక‌ర్తల మండ‌లి అధ్యక్షుడు వైవి.సుబ్బారెడ్డి ప్రకటించారు. డిసెంబ‌రు 25 వైకుంఠ ఏకాద‌శి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భ‌క్తుల‌కు ద‌ర్శనభాగ్యం క‌ల్పిస్తామన్నారు.

అయితే పేద ప్రజ‌ల‌కు వివాహాలు ఆర్థిక‌భారంగా మారకండా ఉండేందుకు వెంక‌టేశ్వస్వామివారి ఆశీస్సుల‌తో… ఇదివరకు అమ‌లుచేసిన క‌ల్యాణ‌మ‌స్తు సామూహిక వివాహ కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభిస్తామ‌ని చెప్పారు. టిటిడికి దేశ‌వ్యాప్తంగా భ‌క్తులు కానుక‌గా అందించిన ఆస్తుల‌ శ్వేత‌ప‌త్రాన్ని ఆయన తాజాగా విడుద‌ల చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version