బ్రేకింగ్ : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..

-

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లేక్ వ్యూ ప్యాలస్ ‌ సెల్లార్ లో వెల్డింగ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగిందని సమాచారం.   దట్టమైన పొగలు భవనం మొత్తం వ్యాపించడంతో భవనంలోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఇదే భవనములో ఆరుషీ బ్లడ్ బ్యాంక్ కూడా ఉంది.

తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఇక్కడ రక్తం ఎక్కిస్తూ ఉంటారు. ప్రమాద సమయంలో ఓ చిన్నారికి రక్తం ఎక్కిస్తుండగా ఘటన చోటు చేసుకోవడంతో  సిబ్బంది హుటాహుటిన కిందికి తీసుకు వచ్చారని చెబుతున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం సంఘటన స్థలానికి చేరుకొని ఆ భవనంలో ఉన్న పలువురిని బయటకు తీసుకు వచ్చారు. భవనానికి వాస్తు విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను ఆర్పే పనిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.  

Read more RELATED
Recommended to you

Exit mobile version