శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్‌.. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు అప్పుడే..

-

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్‌ న్యూస్‌ చెప్పంది. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ వెల్లడించింది. దర్శన టికెట్లు ఉన్న భక్తులకే వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు టీటీడీ అధికారులు. తిరుపతిలో జనవరి 1వ తేదీ నుంచి 9 చోట్ల టోకెన్లు జారీ చేయనున్నారు. రోజుకు 50 వేల చొప్పున 10 రోజుల పాటు 5 లక్షల టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది టీటీడీ. 10 రోజుల కోటా పూర్తయ్యేవరకు ఆఫ్ లైన్ విధానంలో నిరంతరాయంగా టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, తుడా ఇందిరా మైదానం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, గోవిందరాజ సత్రాలు, శేషాద్రినగర్ జడ్పీ హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, జీవకోన జడ్పీ హైస్కూల్, బైరాగిపట్టెడ జడ్పీ హైస్కూల్ లో టోకెన్లు జారీ చేయనున్నారు.

మరోవైపు 16 కంపార్టుమెంట్లలో వేచివున్నారు భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు 70,373 మంది భక్తులు….తలనీలాలు సమర్పించిన 32,954 మంది భక్తులు…హుండీ ఆదాయం రూ. 5.05 కోట్లుగా టీటీడీ తెలిపింది. రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు… ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాదన సేవను రద్దు చేసింది టీటీడీ… ఇవాళ సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టీటీడీ..రేపు శ్రీవారి ఆలయంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది టీటీడీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version