అన్నం పెట్టే రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సున్నం పెడుతున్నాయి : రేవంత్‌ రెడ్డి

-

మరోసారి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్నం పెట్టే రైతుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సున్నం పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు ఒక్కటిచ్చి తామేదో దానకర్ణులం అన్నట్టు బిల్డప్ ఇస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పుల భారంతో రైతు మెడకు బిగుస్తోన్న ఉరితాళ్ల సంగతేంటో మోడీ, కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఒక్కో రైతుపై లక్షన్నర అప్పు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ తన నివేదికలో వెల్లడించింది. రైతుల అప్పుల్లో దేశంలో తెలంగాణకు ఐదో స్థానంలో ఉందని చెప్పింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి ఇప్పటి వరకు 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భగీరథ కార్మికులకు జీతాలు ఇవ్వలేక పరిపాలన కుంటుపడుతోందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 24 గంటల కరెంటు ఇవ్వకుండా 15 గంటలే ఇస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్ల పరిపాలనలో దుష్ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ఆరోపించారు రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version