వినాయక చవితికి కానుకగా OTT లో “టక్ జగదీష్”

-

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా ”టక్ జగదీష్”. షైన్ స్క్రీన్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా లో జగపతి బాబు కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది.

అయితే…గత 15 రోజులు గా ఈ సినిమా రిలీజ్‌ పై పెద్ద వివాదం చెల రేగిన విషయం తెలిసిందే. థియేటర్ల లో ఈ సినిమా ను రిలీజ్‌ చేయకపోవడం పై థియేటర్ల యాజమాన్యం సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యం లో ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం ప్రకటించించేసింది. ”టక్ జగదీష్” సినిమా ను వచ్చే నెల 10 న అంటే వినాయక చవితి సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంతేకాదు… అమెజాన్‌ ప్రైమ్‌ లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నాని కూడా ట్వీట్‌ కూడా చేశాడు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version