HOME WORK చేయలేదని చిన్నారులను కొట్టిన ట్యూషన్ టీచర్

-

ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. హోంవర్క్ చేయలేదని ఇద్దరు చిన్నారులను ట్యూషన్ టీచర్ విక్షణారహితంగా కొట్టాడు. ప్లాస్టిక్ పైపుతో దాడికి దిగాడు. ఆరు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇంటి పక్కనే ఉన్న ట్యూషన్ సెంటర్‌కు చదువుకోవడానికి వెళ్తున్నారు. అయితే ఆగస్టు 31వ తేదీన ఈ చిన్నారులు హోంవర్క్ చేయలేదు. దీంతో ట్యూషన్ టీచర్ వారిద్దరిని ఓ గదిలోకి తీసుకెళ్లి ప్లాస్టిక్ పైపుతో కొట్టాడు.

చిన్నారులు-దాడి

దీంతో తీవ్రంగా గాయపడిన చిన్నారులు ఏడ్చుకుంటూ తమ ఇంటికి వెళ్లారు. తీవ్ర గాయాలు అవ్వడంతో వెంటనే తల్లిదండ్రులు చిన్నారులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఢిల్లీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మహిళా కమిషన్ ట్యూషన్ టీచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version