తురుమ్ ఖాన్లు మూవీ ఫుల్ రివ్యూ.. కొత్త వాళ్ళైనా చించేశారుగా..!

-

టాలెంట్ ఉండి మంచి కథనంతో ప్రేక్షకుల ముందుకు వస్తే కొత్త వాళ్ళైనా సరే ఆ సినిమాతో సక్సెస్ సాధించవచ్చు అని నిరూపించారు ఈ యంగ్ కుర్రాళ్ళు. శ్రీరామ్ నిమ్మల అనే ఒక కొత్త హీరో తనలోని టాలెంట్ ను నిరూపించుకుంటూ తెరపైకి తురుమ్ ఖాన్లు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేశారు. ఇకపోతే శ్రీరామ్ నిమ్మల అనుకున్నట్టుగానే ఈ సినిమాతో సక్సెస్ అయ్యారా ? తన టాలెంట్ నిరూపించుకున్నారా? సినిమా ఎలా ఉంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

శివ కళ్యాణ్ రచనా దర్శకత్వంలో నిర్మాత యాసిఫ్ జానీ నిర్మించిన చిత్రం తురుమ్ ఖాన్లు.. ఇందులో శ్రీరామ్ నిమ్మల, దేవరాజ్ పాలమూరు , అవినాష్ చౌదరి హీరోలుగా నటించగా.. ఐశ్వర్య ఉల్లింగల, పులి సీత, విజయ పలాస, ప్రియాంక తదితరులు నటించారు. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మొన్నటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంది అనే విషయానికి వస్తే.. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడం.. అంతేకాదు ఈ చిత్రంలో ఎదురయ్యే ప్రతి సమస్య కూడా లాక్ డౌన్ కారణంగానే వచ్చింది అన్న అంశాన్ని పాయింట్ గా తీసుకొని చాలా చక్కని స్క్రీన్ ప్లే తో డైరెక్టర్ ప్రేక్షకులను అలరించాడు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తుపాకుల గూడెం అనే ఒక విచిత్రమైన ఊర్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒకరు సక్సెస్ అయితే ఓర్వలేని జనాలు ఎక్కువగా ఉంటారు. అలాంటి ఊర్లో బ్రహ్మం, విష్ణు మరియు శంకర్ అనే ముగ్గురు వ్యక్తుల మధ్య సాగే కథ ఇది. పొలిటికల్ నేపథ్యం ఉన్న శంకర్ రెండు రోజుల్లో తన మరదల్ని పెళ్లి చేసుకాబోతుంటాడు సరిగ్గా ఆ సమయంలోనే కరోనా సెకండ్ లాక్ డౌన్ పడుతుంది. అయితే అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కానీ 40 మందికి మించి ఉండకూడదు అని అధికారులు నిబంధనలు పెడతారు. శంకర్ ఆ నియమాలను తగ్గట్టుగానే ఏర్పాటు చేసుకుంటాడు. కానీ ఇంట్లో ఒత్తిడి కారణంగా బంధువులను ఎక్కువగా పిలవాల్సి వచ్చింది.

సరిగ్గా అప్పుడే 40 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని ఫ్రస్టేషన్లో ఉండే బ్రహ్మం ఎంట్రీ ఇచ్చి.. తన కళ్ళ ముందు శంకర్ కి పెళ్లి జరగడాన్ని జీర్ణించుకోలేక పోలీసులకు ఫోన్ చేసి లాక్ డౌన్ నియమాలను అతిక్రమించి పెళ్లి చేసుకుంటున్నారు అని కంప్లైంట్ చేస్తాడు. ఇక వెంటనే పోలీసులు అక్కడికొచ్చి శంకర్ పెళ్లి ని ఆపేస్తారు. బ్రహ్మం వల్లే శంకర్ పెళ్లి ఆగిపోయింది అని తెలుసుకున్న శంకర్ ఎలా అయినా అతడి మీద పగ తీర్చుకోవాలని కసితో ఉంటాడు. మరొకవైపు విష్ణు తన ప్రేయసి పద్మ తనకి తెలియకుండా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని ఆమెను అపార్థం చేసుకుని దూరం పెడుతూ ఉంటాడు. పద్మ ఎంత చెప్పే ప్రయత్నం చేసినా విష్ణు వినడు.. అయితే విష్ణు కి ఎక్కడో తప్పు చేస్తున్నానని ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎలా అయినా ఆమెను కలవాలన్న ఉద్దేశంతో ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లగా.. అప్పుడు కరోనా కారణంగా కాలేజీ ని కూడా మూసేస్తారు.

అయితే పద్మ ని కలవడానికి నేరుగా విష్ణు ఆమె ఊరికే వెళితే.. లాక్ డౌన్ వల్ల బయటి ఊరి వాళ్ళు లోపలికి ఎంట్రీ లేదని చెబుతారు. ఇక చేసేదేమి లేక విష్ణు వెనక్కి వచ్చేస్తాడు. మరి చివరికి విష్ణు, పద్మ ఎలా కలుసుకున్నారు ? వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారా? బ్రహ్మం కి పెళ్లి అవుతుందా? శంకర్ బ్రహ్మం ని దెబ్బతీయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి తన మరదల్ని పెళ్లి చేసుకున్నాడా? లేదా? ఇవన్నీ తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే అయితే ఈ సినిమాలో శ్రీరామ్ నిమ్మల తన యాక్టింగ్ తో పూర్తిస్థాయిలో అదరగొట్టేసాడని చెప్పాలి.ఈయన పర్ఫామెన్స్ కి యువత సైతం ఫిదా అవుతున్నారు . మరి ఈ సినిమా తో శ్రీరామ్ నిమ్మలకి మరెన్నో అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇకపోతే సినిమా చూసిన వారంతా కూడా కొత్త వాళ్ళైనా సరే చాలా అద్భుతంగా నటించారు అంటూ నటీనటులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version