వారికి గుడ్ న్యూస్.. రూ.2 లక్షల బెనిఫిట్..!

-

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ ఎస్‌బీఐ కార్డు కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది.క్రెడిట్ కార్డు వినియోగదారుల కోసం కొత్త ఫీచర్స్ ని తెచ్చింది. పూర్తి వివరాలు చూస్తే.. సూపర్ ప్రీమియం కార్డు ఆరమ్ ఉంటే ఈ ఫీచర్ ని పొందవచ్చు. సీ సూట్ ఎగ్జిక్యూటివ్స్, హై నెట్‌వర్త్ ఇండివీజువల్స్‌కు ఈ కార్డ్స్ లభిస్తాయి. తాజాగా కొత్త యాన్యువల్ స్పెండ్స్ బేస్డ్ మైల్ స్టోన్, వెల్‌కమ్ బెనిఫిట్ గా ఇంటర్నేషనల్ లాంజ్ బెనిఫిట్స్, గోల్ఫ్ ప్రివిలైజెస్ వంటి ఫీచర్లు ఇస్తోంది.

అలానే ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా కలగనున్నాయట. ఏడాదికి మొత్తంగా రూ. 2 లక్షల వరకు కూడా బెనిఫిట్ కూడా ఉందట.  సూపర్ ప్రీమియం విభాగం లోకి కస్టమర్లకు ఈ కొత్త సేవలు కలగనున్నాయి. ఎస్‌బీఐ కార్డు ఎండీ, సీఈఓ అభిజిత్ చక్రవర్తి ఈ విషయాలని చెప్పారు. అపరిమిత ఇంటర్నేషనల్ లాంజ్ యాక్సెస్ ని ఈ కార్డు తో పొందవచ్చన్నారు.

ఈ కార్డు కలిగిన వారితో వచ్చే గెస్ట్‌లకు కూడా నాలుగు సార్లు లాంజ్ యాక్సెస్ వుంటుందట. ఈ క్రెడిట్ కార్డు కలిగిన వారికి ఏడాది పాటు క్లబ్ మారియట్ మెంబర్‌షిప్ కూడా లభిస్తుందట. హోటల్‌లో స్టే చేయడం, ఫుడ్, బేవరేజెస్, స్పా వంటి వాటికైతే 25 శాతం మేర డిస్కౌంట్ ఉంటుంది. ఈ ఆఫర్ మారియట్ గ్రూప్ హోటల్స్‌కు మాత్రమే. కార్డు జాయినింగ్ ఫీజు రూ. 9,999గా వుంది. ఏడాదికి రూ. 12 లక్షలు ఖర్చు చేస్తే ఫీజును మాఫీ చేస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version