డబ్బా పాలు తాగి కవలలు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. నిన్న మధ్యాహ్నం తమ నాలుగు నెలల పిల్లలకు డబ్బా పాలు పట్టించింది తల్లి లాస్య.
అయితే, కాసేపటికే పిల్లల ముక్కులో నుంచి పాలు కారాయి. అనంతరం పిల్లలు ఇద్దరూ స్పృహ కోల్పోయారు. వెంటనే వారిని భూపాలపల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే పిల్లలు మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. దీంతో తమ సంతానాన్ని కోల్పోవడంతో బాధిత పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో నగరంపల్లిలో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
డబ్బా పాలు తాగి కవల పిల్లలు మృతి..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో విషాదం
మధ్యాహ్నం 4 నెలల పిల్లలకు డబ్బా పాలు తాగించిన తల్లి లాస్య
ముక్కులో నుంచి పాలు కారుతూ స్పృహ కోల్పోయిన చిన్నారులు
భూపాలపల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే పిల్లలు మృతి చెందినట్లు… pic.twitter.com/Cm2aODzYeB
— BIG TV Breaking News (@bigtvtelugu) February 22, 2025