జనసేన నేతలతో పవన్‌ కళ్యాణ్ అత్యవసర సమావేశం !

-

జనసేన నేతలతో పవన్‌ కళ్యాణ్ అత్యవసర సమావేశం ఉండనుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరుగనుంది. జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ ఉంటుంది. బడ్జెట్ పై అవగాహన, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, బడ్జెట్ పై ఎలా చర్చించాలి అనే అంశాలపై దిశా నిర్దేశం చేయనున్నారు పవన్‌ కళ్యాణ్.

Jana Sena legislative party meeting under the chairmanship of Deputy CM Pawan Kalyan today at 5 pm

కాగా.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆస్పత్రి పాలయ్యాడు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరారు. జ్వరం, వెన్నునొప్పితో బాధపడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు స్కానింగ్, ఇతర వైద్య పరీక్షలు చేశారు. రిపోర్ట్స్ పరిశీలించి మరికొన్ని టెస్టులు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అవసరం ఉంటుందన్నారు వైద్యులు.

Read more RELATED
Recommended to you

Latest news