హత్రాస్ ఘటనలో కొత్త ట్విస్ట్.. వారిద్దరూ గంటల పాటు ఫోన్ లో ?

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ రేప్ ఘటనలో కొత్త ట్విస్ట్‌ తెర మీదకు వచ్చింది. అదేంటంటే బాధితురాలు ప్రధాన నిందితుడు ఏడాది నుంచి ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు పోలీసులు చెప్పు కొస్తున్నారు. బాధితురాలు ప్రధాన నిందితుడితో నిరంతరం ఫోన్‌ టచ్‌ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలి సోదరుడు సత్యేంద్ర పేరిట ఉన్న నంబర్‌ నుంచి సందీప్‌ కు క్రమం తప్పకుండా వందలాది కాల్స్ వచ్చినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు.

మరో వైపు పోలీసుల తీరు మీద దళిత సంఘాలతో పాటు విపక్షాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముందు అసలు రేప్ జరగలేదని అన్నారని, ఇప్పుడు ముందు నుండీ మాట్లాడుకుంటున్నారని అంటున్నారని పోలీసులు కావాలనే కేసును తప్పుదోవ పట్టించడానికి దారుణానికి బలయి మరణించిన ఆమె మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండి పడుతున్నారు. ఇక ఈరోజు ఈ కేసు మీద ఏర్పాటు చేయబడిన సిట్‌ బృందం సీఎం యోగికి నివేదిక ఇవ్వనుంది. అలానే ఈ కేసుని సీబీఐకి అప్పగించిన క్రమంలో త్వరలో కేసులోకి సీబీఐ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version