తెలంగాణ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి…ఎప్పటికప్పుడు రాజకీయాలు సరికొత్త మలుపులు తిరుగుతున్నాయి…ఎప్పుడు ఏ పార్టీది పైచేయిగా ఉంటుందో..ఎప్పుడు ఏ పార్టీ కిందికి పడిపోతుందో అర్ధం కాకుండా ఉంది..అయితే ఎప్పటికప్పుడు పైచేయి సాధించాలని బీజేపీ మాత్రం గట్టిగా ప్రయత్నిస్తుంది..కేంద్రంలో అధికారంలో ఉండటంతో బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తుంది…ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీని గట్టిగా టార్గెట్ చేస్తూ…ఆ పార్టీని దెబ్బకొట్టాలని చూస్తూనే, మరోవైపు బలంగా ఉన్న ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని వీక్ చేసి, ఆ స్థానంలోకి రావాలని బీజేపీ బాగా ట్రై చేస్తుంది.
ఈ ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతున్నాయనే చెప్పొచ్చు..పైగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో రాజకీయం చేస్తూ, కమాలన్ని ఎప్పటికప్పుడు పైకి లేపాలని చూస్తూనే ఉన్నారు..ఈ ప్రయత్నాల్లో భాగంగా వలసలని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులని బీజేపీలోకి తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. ఇప్పటికే చాలామంది నేతలు కమలం పార్టీలో చేరిన విషయం తెలిసిందే..ఇక ఈ విషయంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి మైనస్ మార్కులే పడుతున్నాయి..వలసలని ప్రోత్సహించడంలో రేవంత్ రెడ్డి బాగా వెనుకబడ్డారు.
పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలతోనే రేవంత్ ఇబ్బంది పడుతున్నారు…అందుకే పార్టీకి ఉపయోగపడే వలసలని ప్రోత్సహించడంలో వెనుకబడి ఉన్నారు…ఈ విషయంలో మాత్రం బండికి మంచి మార్కులు పడుతున్నాయి..వలసలని బాగా ప్రోత్సహించి బీజేపీని పైకి లేపుతున్నారు…ఇక ఇటీవల కూడా ఇద్దరు బలమైన నాయకులని కమలంలోకి తీసుకోచ్చేందుకు బండి ప్రయత్నిస్తున్నారు.
ఆర్ధికంగా, రాజకీయంగా బలంగా ఉన్న కొండా విశ్వేశ్వర రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కమలంలోకి తీసుకురావడం కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. ఆ ఇద్దరు నేతలు కూడా కమలంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని ఇటీవల కథనాలు వస్తున్నాయి. ఇక వీరు గాని కమలంలోకి వస్తే బండికి ఇంకా ప్లస్ అవుతుంది…రేవంత్ రెడ్డికి మైనస్ పెరుగుతుంది.