తెలంగాణలో కేసీఆర్ తన కేబినెట్‌ను విస్తరిస్తారన్న వార్తలు కొద్ది రోజులుగా జోరుగా ట్రెండ్ అవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాతే కేసీఆర్ కేబినెట్‌ను విస్తరించాలని అనుకున్నారు. అయితే ఆ ఎన్నికల్లో ఫలితాలు ఆయన అనుకున్న విధంగా రాకపోవడంతో కేబినెట్ విస్తరణ వాయిదా వేశారు. ఇక తెలంగాణలో రెండోసారి కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుండడంతో కేసీఆర్ ఎట్టకేలకు కేబినెట్‌ను విస్తరిస్తున్నట్టు తెలుస్తోంది. దసరా ముహూర్తంగానే ఈ కార్యక్రమం ఉంటుందని తెలుస్తోంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రస్తుతానికి మహిళల్లో ఒక్కరికే మంత్రి ఇచ్చి.. ఇంకోకటి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా కొత్త క్యాబినెట్ లోకి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌లను తీసుకుంటే… వారిద్దరికి పాత శాఖలే కేటాయిస్తారా లేక… ఏవైనా మార్పులు చేర్పులు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.
కేసీఆర్ కేబినెట్‌లో మంత్రులకు ఎవ్వరికి చోటు లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆయన తొలి ప్రభుత్వంలో కూడా ఒక్క మహిళా మంత్రి లేకుండానే నడిపేశారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లోకి వచ్చిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు మహిళా కోటాలో బలంగా వినిపిస్తోంది. ఆమెతో పాటు టీఆర్ఎస్ నుంచి గొంగిడి సునీతారెడ్డి, ఆజ్మీరా రేఖా శ్యాం నాయక్, పద్మా దేవేందర్‌రెడ్డి కూడా మంత్రి పదవులు ఆశిస్తున్నారు.
ఇక రెడ్డి కోటాలో గుత్తా ఎంట్రీ ఖాయం అంటున్నారు. అయితే గత లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఒకరిద్దరు రెడ్లు కేబినెట్ నుంచి అవుట్ అవుతారన్న ప్రచారమూ ఉంది. అలాగే కేసీఆర్ సన్నిహితుడు తుమ్మలకు ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నా