ట్విట్ట‌ర్‌ నయా షాపింగ్‌ ఫీచర్‌ తెలుసా?

-

ట్విట్ట‌ర్‌ ఓ కొత్త యాప్‌ను ప్రారంభించింది. ట్విట్ట‌ర్‌ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్పులు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా Twitter New Feature సూపర్‌ షాపింగ్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే ‘షాప్‌ మాడ్యుల్‌’ ఈ కొత్త ఫీచర్‌ను ట్విట్ట‌ర్‌ అమెరికాలో ప్రారంభించింది. ఈ ఫీచర్‌తో బిజినెస్‌ నిర్వహించకునే వారు తమ బ్రాండ్లను వారి ప్రొఫైల్‌ పైభాగంలో ప్ర‌మోట్‌ చేసుకోవడమే కాకుండా… వినియోగదారులు అక్కడే షాపింగ్‌ చేసుకోవచ్చు. ఏదైనా వస్తువు మీకు నచ్చితే ఆ ప్రొడక్ట్‌పై క్లిక్‌ చేయగానే దాని ధర, పేమెంట్‌ ఆప్షన్‌ అన్ని వివరాలు అక్కడే కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కేవలం ఐఓఎస్‌ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని ట్విట్ట‌ర్‌ తెలిపింది.

twitter | ట్విట్ట‌ర్‌

ఈ ఫీచర్‌లో భాగంగా గేమ్‌స్టాప్, ఆర్డెన్‌ కోవ్‌ వంటి మరో పది బ్రాండ్లతో ట్విట్టర్‌ ఒప్పందం చేసుకుంది. కానీ, ప్రస్తుతం తక్కువ సంఖ్యలో బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అతిత్వరలో మరిన్ని బ్రాండ్లను పరిచయం చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ట్విట్టర్‌ వలే ఫేస్‌బుక్, ఇన్‌ స్ట్రాగామ్, వాట్సాప్ వంటి సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లు ఎప్పటి నుంచో షాపింగ్‌ సేవలను అందిస్తున్నాయి. దీనితో పాటు ట్విట్టర్‌ తన ఖాతాదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే వాయిస్‌ టైపింగ్‌ యాప్‌. అంటే వాయిస్‌ టెక్ట్స్‌ రూపంలోకి మారుతుంది. ఈ ఫీచర్‌ను కేవలం ఐఓఎస్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version