సోషల్ మీడియాపై షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మోడీ…!

-

ఎప్పుడూ సోషల్ మీడియాలో ఉత్సాహంగా ఉండే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు అనూహ్యంగా సోషల్ మీడియాకు గుడ్ బై చెప్తారు అనే ప్రచారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 2009లోనే సోషల్‌ మీడియాలో చేరిన మోదీ ఆ మాధ్యమాల్లో పెద్ద సెలబ్రిటీగా మారారు. ఆయనకు ట్విటర్‌లో 5.33 కోట్లు, ఫేస్‌బుక్‌లో 4.4 కోట్లు, ఇన్‌స్టాలో 3.52 కోట్లు, యూట్యూబ్‌లో 0.45 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు.

అనూహ్యంగా మోడీ సోషల్ మీడియాను వదిలేసే నిర్ణయంపై పెద్ద చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అయితే ఏకంగా కీలక విమర్శలు చేసింది. దేశ౦లో సోషల్ మీడియా నిషేధించే కుట్ర జరుగుతుంది అంటూ కామెంట్ చేసారు. పౌరసత్వ సవరణ చట్టం సహా ఢిల్లీ అల్లర్లు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయని, అందుకే మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారని పలువురు కామెంట్ చేయడం విశేషం. సోషల్ మీడియాలో మోడిని పలువురు ట్రోల్ చేసారు.

దీనిపై తాజాగా మోడీ నుంచి కీలక ప్రకటన వచ్చింది. ‘ఆదివారం మహిళా దినోత్సవం. మనల్ని ఆదర్శవంతులను చేస్తున్న మహిళలకు నేను నా సోషల్ మీడియా అకౌంట్లను వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఆ విధంగా చేయడంతో వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుంది. మీరు అలాంటి మహిళేనా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? అయితే అలాంటి మహిళల స్టోరీస్ #SheInspireUs తో ట్యాగ్ చేయండి’ అని మోడీ పోస్ట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version