ట్విట‌ర్ పోల్ : ఆర్ఆర్ఆర్ భార‌తీయుడి స‌త్తాని చాటుతుంద‌ని ఆశిస్తున్నారా?

-

అవును : 96.6 శాతం
కాదు : 3.4 శాతం

దేశ వ్యాప్తంగానే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది సినీ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్‌ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ ఇవాళ ఎట్టకేలకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. బాహుబలి తరువాత రాజమౌళి దర్శకత్వంతో వస్తున్న భారీ మల్టీ స్టారర్ సినిమా కావడంతో అందరిలోనూ… భారీగా అంచ‌నాలున్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా… తారక్ కొమురం భీంగా నటించారు. బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవ్ గన్, అలియా భట్ ఉండటం కూడా సినిమాపై భారీ హైప్ పెంచింది. అటు సినిమాపై పాజిటివ్‌ టాక్‌ రాగానే.. జనాలు ఎగబడి చూస్తున్నారు.

ఎంత భారీ తనం, భారీ తారాగణం ఉన్నా.. కథను నడిపించేవి బలమైన ఎమోషన్సే.. వాటిని అంతే బలంగా పట్టుకోవడంలో దిట్ట అయిన రాజమౌళి మార్క్‌ కొమురం భీముడో పాటలో పతాక స్థాయిలో కనిపించింది. అప్పటి వరకూ కథను ఇంట్రడక్షన్స్‌, పాటలు, ఫైట్స్‌ ఇద్దరు స్టార్ల మధ్య దోస్తీలు, జగడాలు చూసి ఆనందిస్తున్న ప్రేక్షకులకు ఆ పాట సన్నివేశం దానిని చిత్రీకరించిన తీరు మాత్రం హృదయాల్లోకి చొచ్చుకెళుతుంది.

ఇక రక్తం ధారలు కడుతున్నా… ఒంటిని గాయాల బాధ వేధిస్తున్నా.. తారక్‌ కళ్లలో కనిపించే ఆ గర్వం జాతీయ పతాకంలా రెపరెపలాడింది. అటు చరణ్‌ యాక్టింగ్‌ కూడా ఓ హాలీవుడ్‌ స్టార్‌ ను తలపించింది. మొత్తానికి సినిమా చూసిన వాళ్లు.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చరిత్ర తిరగ రాయబోతుందని.. ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత దేశ చరిత్రలోనే ఓ గొప్ప మూవీగా నిలుస్తుందని ప్రేక్షకులు, ప్రముఖులు చెబుతున్నారు. రూ.350 కోట్లు పెట్టిన తీసిన ఈ సినిమా.. కచ్చితంగా రూ.700 కోట్లు వసూలు చేస్తుందని చెబుతున్నారు. అంతేకాదు.. ఒక తెలుగు వాడి సినిమాలో ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూడటం కూడా మనకు గర్వకారణం. ఈ వేవ్‌ కొనసాగితే.. తప్పకుండా ఆర్ఆర్ఆర్ భార‌తీయుడి స‌త్తాని చాటుతుంద‌ని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version