IND vs WI: గోల్డెన్ డక్‌తో రోహిత్ శర్మ చెత్త రికార్డు

-

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ నిన్నటి మ్యాచ్ లో డక్‌ అవుట్‌ అయ్యాడు. ఈ నేపథ్యలో రోహిత్‌ శర్మ ఓ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ 20 ల్లో ఎక్కువ సార్లు గోల్డెన్‌ డక్‌ అవుట్‌ అయిన రెండో ఓపెనర్‌ గా రోహిత్‌ శర్మ నిలిచాడు.

4 సార్లు డకౌట్‌ అయిన శ్రీలంక మాజీ క్రికెటర్‌ దిల్షాన్‌ నాలుగు సార్లు గోల్డెన్‌ డకౌటై అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆరోన్‌ ఫించర్‌, జాసన్‌ రాయ్‌ లు సైతం మూడు సార్లు డకౌటై రోహిత్‌ తో సమంగా నిలిచారు. ఇక ఈ ఇన్నింగ్స్‌ ఫస్ట్‌ బాల్‌ కే ఔటైన మూడో టీమిండియా బ్యాటర్‌ గా కూడా రోహిత్‌ చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. కాగా సెయింట్ కింట్స్‌ వేదికగా జరిగిన రెండో టీ 20 లో టీమిండియా పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని చేధించింది విండీస్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 138 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ లక్ష్యాన్ని విండీస్‌ 5 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version