స్వర్గీయ నందమూరి తారక రామారావు చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి నిన్న అనగా ఆగస్టు ఒకటి 2022 మధ్యాహ్నం సమయంలో తన ఇంటిలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తీవ్ర దిగ్వానికి గురిచేసింది. ముఖ్యంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారన్న వార్త సామాన్యుల తో పాటు పలువురు ప్రముఖులను కూడా కలవరపాటుకు గురిచేస్తోందని చెప్పవచ్చు. ఇకపోతే ఉస్మానియా ఆసుపత్రి మార్చరీలో ఉమామహేశ్వరి పార్తివదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఇక ఆమె ఉరివేసుకోవడం వల్లే మరణించినట్లు ప్రాథమికంగా వైద్యులు తెలిపారు.
ఇక పోస్టుమార్టం అనంతరం వైద్యులు ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక అక్కడి నుంచి మృతదేహాన్ని జూబ్లీహిల్స్ లోని తమ నివాసానికి తరలించారు. ఇక ఉమామహేశ్వరీ కి ఇద్దరూ కూతుర్లు కాగా పెద్ద కుమార్తె విశాల అమెరికాలో ఉండగా చిన్న కుమార్తె దీక్షిత బాచుపల్లి లో నివాసం ఉంటున్నారు. దీక్షిత తన భర్తతో కలిసి ఆదివారం రాత్రి తన పుట్టింటికి వచ్చారు. ఇక సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత తన తల్లి తలుపులను బలవంతంగా తెలిసి చూడగా ఆమె చున్నికి వేలాడుతున్నారు అని దీక్షిత తెలిపారు. ఇక అనంతరం చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, దగ్గుపాటి వెంకటేశ్వరరావు లకు ఫోన్ చేసి సమాచారం అందించినట్లు ఆమె తెలిపారు.
మరోవైపు ఉమామహేశ్వరి చాలా మంచివారని , ఎవరిని కూడా ఒక మాట కూడా అనేవారు కాదని , చాలా మృధు స్వభావి అని అక్కడ పనివాళ్ళు, బంధువులు చెబుతున్నారు. ఇక ఆమె కోరిక మేరకు ఆమె నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేయడం జరిగింది.