చిక్కులో పడేసిన ప్రేయసి ట్విట్‌..!

-

‘స్వలింగ సంపర్క జంటలకు ఇండోనేషియా స్వర్గధామం’ లాంటిదని ఓ యువతి చేసిన ట్వీట్‌ ఆమెను కష్టాల్లో పడేసింది. తన ప్రేయసితో పాటు దేశాన్ని వీడి, పొమ్మని అధికారులు ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తతంగమంతా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అమెరికాకు చెందని క్రిస్టిన్‌ గ్రే అనే అమ్మాయి, తన గర్ల్‌ఫ్రెండ్‌ సాండ్రాతో కలిసి బాలికి వెళ్లి అక్కడే నివాసమేర్పర్చుకుంది. ఆ జంట జీవనోపాధికోసం ఆదాల మార్గాలను అన్వేషించడం ప్రారంభించింది. ఈ క్రమంలో వారు బాలిలో గడుపుతున్న విధానం, ఇరువురికి అవుతున్న ఖర్చు మౌలిక వసతులు తదితర అంశాలపై ‘అవర్‌ బాలి లైప్‌ ఈజ్‌ యువర్స్‌’ అనే పేరుతో ఓ పుస్తకం రచించారు. గ్రాఫిక్‌ డిజైనరైన క్రిస్టిన్‌ తను పుస్తకాన్ని సోషల్‌ మీడియాతో పంచుకోగా అందులో రాసిన కొన్ని పదాలు, వారి అనుభవాలు వివాదానికి దారి తీశాయి.

లింక్‌ షేర్‌ చేసి..

తమ జీవితంలో వేసుకున్న ప్రణాళికలు కరోనా మూలంగా సఫలం కాలేదు. లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటున్న మేము బాలికి మకాం మార్చాం. తక్కువ ఖర్చుతోనే ఇక్కడ ప్రశాంతమైన జీవితాన్ని గడపవచ్చు. ముఖ్యమగా ఇక్కడ‘ ఎల్జీబీటీ కమ్యూనిటీ’ హాయిగా తమ జీవితాన్ని గడపవచ్చని క్రిస్టిన తన పుస్తకంలో పేర్కొంది. అంతటితో ఆగకుండా కోవిడ్‌ కాలంలోనూ అక్రమ పద్ధతులో బాలికి వచ్చే మార్గాలను తమ వీసా ఏజెంట్ల ద్వారా చెబుతామని ఓ లింక్‌ను సైతం ట్విటర్‌లో షేర్‌ చేసింది. ఈ ట్విట్‌ చదివిన న్యాయశాఖ అధికారులు.. క్రిస్టినతో పాటు ఆమె సహచరి తమకు ఎలాంటి సమాచారం లేకుండానే ఇక్కడ నివాసం ఏర్పర్చుకుని ఉంటున్నారని పేర్కొన్నారు. బాలి సంస్కృతి, సంప్రదాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని వారిపై కోపోద్రిక్తులయ్యారు.

క్రిస్టిన వాదన మరోలా..

అందుకు బాధ్యులైన ఇరువురిని అమెరికా నుంచి పంపించేందుకు తగు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ విషయమై అక్కడున్న ఎల్జీబీటీ కమ్యూనిటీ సైతం క్రిస్టినపై మండిపడుతున్నారు. ఇండోనేషియాలో స్వలింగ సంపర్గం నేరం కాకున్నా.. తమ పరిస్థితులు అంతగా మెరుగ్గా లేవని దుష్ప్రచారాలు చేయరాదని హెచ్చరించారు. తాను గే కావడంతోనే తమని ఇక్కడి నుంచి పంపేస్తున్నారని క్రిస్టిన ఆరోపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version