గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ క్యాంప్ ఆఫీసు మెయిన్ గేట్లకు బీజేపీ నాయకులు టూ లెట్ బోర్డును పెట్టారు. అనంతరం గేటు ఎదుట బైఠాయించిన బీజేపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే కనిపించడం లేదని ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే బయటకు రావడం లేదని, నియోజకవర్గంలో చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ కనిపించడం లేదంటూ వాంటెడ్ ఎమ్మెల్యే బోర్డులను సైతం ఏర్పాటు చేయడంతో అక్కడకు పోలీసులు చేరుకున్నారు. అక్కడ పరిస్థితి చేయిదాటకుండా వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.