దమ్ముంటే అశోక్ నగర్ రా.. రాహుల్ గాంధీ.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో నిరుద్యోగుల గురించి పట్టించుకోలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.  రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.  ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట కూడా లేదు. 

గంటన్నర ఉపన్యాసం తరువాత అర్థం అయింది ఏందంటే..ఆరు గ్యారెంటీలు గోవిందా అని అర్థం అయిందన్నారు. చేనేతలకు అరకొరగా కేటాయించారని తెలిపారు. ఉద్యోగ కల్పన విషయంలో పచ్చి అబద్దాలు చెప్పారని తెలిపారు. హైదరాబాద్ మహానగరం అధ్వాన్నంగా మారిందన్నారు. కరోనా వైరస్ కంటే కాంగ్రెస్ ప్రమాదకరమని గతంలోనే చెప్పామని తెలిపారు. ఈ ప్రభుత్వం ఇప్పటికే 1లక్షా60వేల కోట్ల అప్పులు చేసింది. కాంగ్రెస్ పాలన 40 శాతం పూర్తి అయింది. తులం బంగారం, మహిళలకు రూ.2500 ల గురించి ప్రస్తావనే లేదు. రేవంత్ రెడ్డి చేతగాని తనానికి నిలువుటద్దం అని చెబుతున్నానని తెలిపారు కేటీఆర్. 

Read more RELATED
Recommended to you

Latest news