పుల్వామాలో ఇద్దరు ఉగ్రవాదులు హతం

-

జమ్మూకశ్మీర్ పుల్వామాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. ఈ ఉగ్రవాదులు జైషే ఉగ్రవాద సంస్థకు చెందిన వారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం ఆదివారం నాడు భద్రతా బలగాలకు అందింది. దీంతో భారత్య సైన్యం, స్థానిక పోలీసుల సంయుక్త బృందం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ మేరకు ఉగ్రవాదులు ఉన్న స్థలాన్ని గుర్తించారు. దీంతో ఉగ్రవాదులకు, భారత బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.

భారత సైన్యం

ఈ కాల్పుల్లో ఆదివారం రాత్రి ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అలాగే సోమవారం ఉదయం మరో ఉగ్రవాదిని హతమార్చినట్లు ఐజీపీ వెల్లడించింది. కాల్పుల అనంతరం.. వారి దగ్గరున్న ఏక్-47 రైఫిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పుల్వామాలోని గండిపొరా ప్రాంతంలో ఆదివారం రాత్రి నుంచి కాల్పులు మొదలయ్యాయని అధికారులు పేర్కొన్నారు. అయితే రియాజ్ అనే పోలీసును కాల్చి చంపిన ఘటనలో ఈ ఇద్దరు ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version