గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌ కు వచ్చిన ఇద్దరు మృతి..పవన్‌ కళ్యాణ్‌ భారీ సాయం !

-

గేమ్‌ ఛేంజర్‌ ఈవెంట్‌ కు వచ్చిన ఇద్దరు మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ రెండు కుటుంబాలకు పవన్‌ కళ్యాణ్‌ భారీ సాయం ప్రకటించారు. ఏడీబీ రోడ్డుపై ప్రమాదంలో యువకుల మృతి బాధాకరమని పోస్ట్‌ పెట్టారు పవన్‌. జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటన చేశారు. కాకినాడ – రాజమహేంద్రవరం నగరాల మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు ఛిద్రమైపోయింది.

pawan

గత అయిదేళ్ళల్లో ఈ రోడ్డు గురించి పట్టించుకోలేదు. పాడైపోయిన ఈ రోడ్డును బాగు చేస్తున్నారు. ఈ దశలో ఏడీబీ రోడ్డుపై చోటు చేసుకున్నా ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని తెలిపారు. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ, శ్రీ తోకాడ చరణ్ శనివారం రాత్రి ద్విచక్రవాహనంపై ఇళ్లకు వెళ్తున్నారు. బైక్ మీద వెళ్తున్న ఆ యువకులను వేగంగా వస్తున్న వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ యువకులు మృతి చెందారు. శ్రీ మణికంఠ, శ్రీ చరణ్ కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని ట్వీట్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news